డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ.. యంగ్ హీరో సినిమాలో స్పెషల్ కేమియో!!

క్రికెట్ అభిమానులకు డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓపెనర్‌గా బరిలోకి దిగితే, సిక్సులు, బౌండరీలతో ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టిస్తుంటాడు.

Update: 2024-09-22 10:23 GMT

దిశ,వెబ్‌డెస్క్: క్రికెట్ అభిమానులకు డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓపెనర్‌గా బరిలోకి దిగితే, సిక్సులు, బౌండరీలతో ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టిస్తుంటాడు. ఆస్ట్రేలియా జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. క్రికెట్ మాత్రమే కాకుండా మ్యాచ్ సమయంలో చేసే డాన్స్‌లతో కూడా అభిమానులను అలరిస్తుంటాడు. అంతేకాదు డేవిడ్ వార్నర్ ఫ్యామిలీతో కలిసి చేసిన రీల్స్ ఇప్పటికే మిలియన్ వ్యూస్‌ని అందుకున్నాయి. ముఖ్యంగా పుష్ప సినిమా పాటలకు ఆయన చేసిన డాన్సులకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియా మూవీస్‌కు సంబంధించిన డైలాగ్స్, సాంగ్స్‌తో సోషల్ మీడియాలో అలరిస్తూనే ఉంటారు. టాలీవుడ్ యంగ్ హీరోలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రిన్స్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీలలో డైలాగ్స్ చెప్పడంలో వార్నర్ తనకంటూ ప్రత్యేక స్టైల్‌ను ఏర్పరచుకున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా డేవిడ్ వార్నర్‌కు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో డేంజరస్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ మాస్‌ లుక్ లో కనిపిస్తున్నారు. మెయిన్‌గా ఓ చేతిలో గన్ పట్టుకొని, చుట్టూ బాడీగార్డులతో ఓ గ్యాంగ్‌స్టర్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ లుక్‌లో ఉన్న డేవిడ్ వార్నర్ చూసిన అభిమానులు హీరో నితిన్ మూవీలో(రాబిన్‌హుడ్) ఆయన ఓ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు భారీ బడ్జెట్ యాక్షన్ మూవీతో ప్రేక్షకులకు సడన్ సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఉండొచ్చని కామెంట్స్ పెడుతున్నారు. ఈ రూమర్స్ మీద అధికార ప్రకటన వచ్చే వరకు ఏం చెప్పలేం.. లేదా స్వయంగా వార్నర్ స్పందిస్తే గాని క్లారిటీ రాదు. ఏదీ ఎమైనా ప్రజెంట్ సోషల్ మీడియాలో డేవిడ్ వార్నర్ ఫొటో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Full View


Similar News