Sreeleela: పెళ్లిపై శ్రీలీల షాకింగ్ రియాక్షన్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా చేసిన ‘పెళ్లి సందడి’ సినిమాతో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

Update: 2024-09-22 09:45 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా చేసిన ‘పెళ్లి సందడి’ సినిమాతో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా రవితేజతో చేసిన ‘ధమాకా’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఈ అమ్మడుకి చేతినిండా అవకాశాలు వచ్చాయి. ఒకేసారి పది సినిమాల్లో నటించే చాన్స్ దక్కించుకుంది.

కానీ వరుసగా నాలుగు డిజాస్టర్లు తన ఖాతాలో పడటంతో ఒక్కసారిగా క్రేజ్ పడిపోయింది. దీంతో కొన్ని సినిమాల నుంచి తొలగించారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల శ్రీలీల మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’ మూవీ చేసింది. ఈ చిత్రం పెద్దగా హిట్ అందుకోకపోవడంతో శ్రీలీల కాస్త గ్యాప్ ఇచ్చింది. ప్రజెంట్ ఆమె రవితేజతో ఓ సినిమా చేయబోతుంది. అలాగే నితిన్‌కు జోడీగా రాబిన్ హుడ్, పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్‌ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్రమంలో..

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల పెళ్లిపై వార్తలపై క్లారిటీ ఇస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘చదువు మధ్యలో వదిలేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పుడు మళ్లీ చదువు పైన దృష్టి పెట్టా. మధ్యలో వదిలేసిన చదువును పూర్తి చేయాలనుకుంటున్నాను. అందుకే ఎక్కువ సినిమాలకు కమిట్ అవ్వడం లేదు. ప్రజెంట్ కొద్ది కాలం చదువు, నటనపై కాకుండా కనీసం నా వ్యక్తిగత విషయాల పైన కూడా శ్రద్ధ పెట్టలేక పోతున్నాను. నాకు అంత టైమ్ లేదు. కొద్ది కాలం తర్వాత వ్యక్తి విషయాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది.


Read More...

Samantha: సామ్ ఇంట ఘనంగా పెళ్లి వేడుకలు.. ఎవరిదో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! 


Similar News