Traditional look: సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకుంటోన్న ఐకాన్ స్టార్ గారాలపట్టి-సతీమణి స్నేహా
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి అండ్ కుమార్తె అర్హ తాజాగా సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకుంటున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి అండ్ కుమార్తె అర్హ తాజాగా సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకుంటున్నారు. స్నేహారెడ్డి ఈ పిక్స్‌ను తన ఫ్యాన్స్‌తో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పిక్స్ చూస్తే వీరు ఏదో పూజా కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది. పింక్ కలర్ శారీలో ఫొటోల ముందు స్నేహా దీపం వెలిగిస్తుండగా.. బుజ్జి అర్హ ఆ దీపాన్ని కాపాడేందుకు చేతులు అడ్డం పెట్టింది చూడచ్చు. గదవలకు గంధం పెట్టుకుని పింక్ అండ్ యల్లో కలర్ డ్రెస్‌లో అర్హ చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. ఈ పిక్స్ వీక్షించిన నెటిజన్లు లవ్‌లీ కామెంట్లు పెడుతున్నారు.
ఇక స్నేహారెడ్డి వెకేషన్స్‌కు వెళ్లినా, ఫేస్టివల్స్, ఈవెంట్స్ సంబంధించిన ఫొటోలకు తరచూ అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ఇదిలా ఉంటే.. ప్రజెంట్ అల్లు అర్జున్ ‘పుష్ప-2’ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ వాయిదాల మధ్య నడుస్తుంది. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా.. ప్రేక్షకులు సెకండ్ పార్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరీ థియేటర్లలో ఎప్పుడు సందడి చేయనుందో చూడాలి.