India vs West Indies 2nd Test : తొలి ఇన్నింగ్స్‌ వెస్టిండీస్ ఆలౌట్.. టీమిండియాకి భారీ ఆధిక్యం

Update: 2023-07-23 14:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు ఎట్టకేలకు మంచి కమ్‌బ్యాక్ ఇచ్చారు. నాలుగో రోజు మొదటి గంటలోనే 5 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు, వెస్టిండీస్‌ని తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకి ఆలౌట్ చేయగలిగారు.. దీంతో భారత జట్టుకి తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. ఓవర్‌ నైట్‌ స్కోరు 229/5తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన విండీస్‌.. మరో 26 పరుగులను మాత్రమే జోడించి ఆలౌటైంది.

విండీస్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (75) అర్ధసెంచరీతో రాణించగా.. అలిక్‌ అథనేజ్‌ (37), తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌ (33), కిర్క్‌ మెక్‌కెంజీ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత్‌ బౌలర్లలో సిరాజ్‌ 5, జడేజా 2, ముకేశ్ 2, అశ్విన్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది. 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న విరాట్‌ కోహ్లి (121) సెంచరీతో  చెలరేగగా.. యశస్వి (57), రోహిత్‌ (80), జడేజా (61), అశ్విన్‌ (56) అర్ధ సెంచరీలతో రాణించారు. విండీస్‌ బౌలర్లలో కీమర్‌ రోచ్‌, వార్రికన్‌ చెరో 3 వికెట్లు.. హోల్డర్‌ 2, గాబ్రియల్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.


Similar News