Smriti Mandhana : ఐసీసీ వన్డే, టీ 20ల్లో టాప్ 3లోకి మంధాన

మహిళల క్రికెట్ వన్డే, టీ 20ర్యాంకింగ్స్ ను ఐసీసీ(ICC ODI and T20) విడుదల చేసింది. భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన(Smriti Mandhana)వన్డేల్లో మూడు స్థానాలు మెరుగుపరుచుకుని రెండో స్ధానంలో నిలిచింది. టీ 20ల్లో ఒక స్థానం ఎగబాకి మూడో స్థానంలో ఉంది.

Update: 2024-12-17 12:34 GMT

దిశ, వెబ్ డెస్క్ : మహిళల క్రికెట్ వన్డే, టీ 20ర్యాంకింగ్స్ ను ఐసీసీ(ICC ODI and T20) విడుదల చేసింది. భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన(Smriti Mandhana)వన్డేల్లో మూడు స్థానాలు మెరుగుపరుచుకుని రెండో స్ధానంలో నిలిచింది. టీ 20ల్లో ఒక స్థానం ఎగబాకి మూడో స్థానంలో ఉంది. తాజాగా అస్ట్రేలియాలో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో మంధాన ఆఖరి మ్యాచ్ లో సెంచరీ(105)తో సత్తా చాటింది. స్వదేశంలో జరిగిన సిరీస్ ను అసీస్ 3-0తో గెలుచుకుంది.

కాగా ఈ ఏడాది 2024లో మంధానకు ఇది నాల్గవ సెంచరీ. మహిళా క్రికెట్ లో ఏడాది వ్యవధిలో నాలుగు సెంచరీలు చేసిన మొదటి బ్యాటర్ గా మంధాన రికార్డు సాధించారు. తన కేరీర్ లో 9సెంచరీలు బాదిన మంధాన భారత్ తరుపునా వన్డేల్లో అధిక సెంచరీలు చేసిన ప్లేయర్ ఆమెనే కావడం విశేషం. మాజీ కెప్టెన్ మిథాలీ ఏడు సెంచరీలు సాధించింది. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత మహిళా క్రికెటర్ల జాబితాలో స్మృతి మంధాన (9), మిథాలీ రాజ్ (7), హర్మన్‌ప్రీత్ కౌర్ (6), పూనమ్ రౌత్ (3) టాప్‌లో ఉన్నారు.

ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన వారిలో మంధాన నాల్గవ స్ధానంలో ఉంది. మంధానతో పాటు నాట్ స్కివర్ బ్రంట్, షార్లెట్ ఎడ్వర్డ్స్, చమరి అటపట్టులు కూడా 9సెంచరీలు చేశారు. అసీస్ బ్యాటర్ మెగ్ లానింగ్ 15సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నారు. కివీస్ బ్యాటర్ సుజీ బెట్స్ 13సెంచరీలు, ఇంగ్లాండ్ కు చెందిన టామి బ్యూమాంట్ లు 10సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నారు.

Tags:    

Similar News