ముంబై జట్టు నుంచి పృథ్వీ షా ఔట్.. ‘నేను ఇంకేం చేయాలి దేవుడా’ అంటూ ఎమోషనల్ పోస్టు

భారత యువ బ్యాటర్ పృథ్వీ షాకు మరో షాక్ తగిలింది.

Update: 2024-12-17 12:36 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత యువ బ్యాటర్ పృథ్వీ షాకు మరో షాక్ తగిలింది. విజయ్ హజారే ట్రోఫీ కోసం మంగళవారం ప్రకటించిన ముంబై జట్టులో అతనికి చోటు దక్కలేదు. ముంబై జట్టులో స్థానం కోల్పోవడంపై పృథ్వీ షా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తన లిస్ట్ ఏ గణాంకాలను తెలుపుతూ ఎమోషనల్ పోస్టు పెట్టాడు.

తాను ఇంకేం చేయాలో చెప్పు దేవుడా అంటూ ఆవేదన చెందాడు. ‘చెప్పు దేవుడా.. నేను ఇంకేం చేయాలి. 65 ఇన్నింగ్స్‌ల్లో 55.7 సగటుతో 126 స్ట్రైక్ రేటుతో 3,399 రన్స్ చేశాను. అయినా నేను సరిపోలేదు. కానీ, నేను నిన్న విశ్వసిస్తాను. ప్రజలు నన్ను నమ్ముతారని ఆశిస్తున్నా. కాబట్టి, నేను తిరిగి వస్తాను. ఓ సాయి రామ్.’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు.

ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సవాళ్లు ఎదుర్కొన్న పృథ్వీ షా మధ్యప్రదేశ్‌తో జరిగిన ఫైనల్‌లో 49 రన్స్‌తో కీలక ఇన్నింగ్స్ ఆడి ముంబై టైటిల్ గెలవడంలో ముఖ్య పోషించాడు. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించనున్నాడు. పృథ్వీ షాతోపాటు భారత సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానేను కూడా జట్టు నుంచి తప్పించారు. సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె వంటి అనుభవజ్ఞులతోపాటు రఘువంశీ, జై బిస్టా వంటి ప్రతిభావంతులకు చోటు దక్కింది.

Tags:    

Similar News