Tim Southee : అంతర్జాతీయ క్రికెట్‌కు టిమ్ సౌథీ గుడ్ బై

అంతర్జాతీయ క్రికెట్‌కు న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ మంగళవారం గుడ్ బై చెప్పాడు.

Update: 2024-12-17 13:46 GMT

దిశ, స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్‌కు న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ మంగళవారం గుడ్ బై చెప్పాడు. తన కెరీర్‌లో ఆడిన చివరి టెస్ట్‌లో న్యూజిలాండ్ ఇంగ్లాండ్‌పై 423 పరుగులతో విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో టిమ్ సౌథీ మాట్లాడాడు. ‘సిరీస్ గెలుచుకున్న ఇంగ్లాండ్‌కు అభినందనలు. 17 ఏళ్లుగా నాకు మద్దతు తెలిపిన న్యూజిలాండ్ క్రికెట్‌కు థ్యాంక్స్. జీవితంలో అనేక ఒదిదొడుకుల్లో తోడుగా నిలిచిన కుటుంబానికి ధన్యవాదాలు. తన ఈ జర్నీ అద్భుతంగా సాగడానికి టీమ్ మేట్స్, సపోర్ట్ స్టాఫ్ అందించిన సహకారం మరవలేనిది. సొంత మైదానం సెడెన్ పార్క్‌‌లో మద్దతుగా నిలిచిన ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు. ఇక నుంచి అందరిలా తాను కూడా ఓ అభిమానిగా క్రికెట్‌ను చూస్తా.’ అని సౌథీ ముగించాడు. 391 టెస్టులు ఆడిన సౌథీ అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 776 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో 164 వికెట్లు తీసి న్యూజిలాండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. వన్డేల్లో 221 వికెట్లు పడగొట్టాడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి మొత్తం 394 మ్యాచ్‌ల్లో 3,288 పరుగులు చేశాడు.

Tags:    

Similar News