పారిస్‌ ఒలంపిక్స్‌కు భారత స్టార్‌ లాంగ్‌జంపర్‌ అర్హత..

ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో శనివారం జరిగిన పురుషుల లాంగ్‌జంప్‌ ఈవెంట్‌లో భారత స్టార్‌ లాంగ్‌జంపర్‌ మురళీ శ్రీశంకర్‌ రజత పతకం సాధించాడు.

Update: 2023-07-16 10:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో శనివారం జరిగిన పురుషుల లాంగ్‌జంప్‌ ఈవెంట్‌లో భారత స్టార్‌ లాంగ్‌జంపర్‌ మురళీ శ్రీశంకర్‌ రజత పతకం సాధించాడు. ఈ ప్రదర్శన అతని కెరీర్‌లోనే రెండో ఉత్తమ ప్రదర్శన కాగా.. పారిస్‌ ఈవెంట్‌ క్వాలిఫికేషన్‌ మార్క్‌ (8.27 మీటర్లు)ను అధిగమించాడు. మురళీ శ్రీశంకర్‌ వచ్చే ఏడాది పారిస్‌లో జరిగే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌ (2024)కు అర్హత సాధించాడు. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. శ్రీశంకర్‌కు ఇది రెండో ఒలింపిక్స్‌ కాగా.. గత టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధింన అతను క్వాలిఫికేషన్‌ రౌండ్లోనే వెనుదిరిగాడు.


Similar News