దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంక బౌలర్ లాహిరు కుమార టెస్టు క్రికెట్‌లో అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా ఈ రికార్డు మూటగట్టుకున్నాడు. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసిన లాహిరు కుమార.. 25 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 164 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో లంక తరఫున టెస్టులలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా నిలిచాడు.
గతంలో ఈ రికార్డు కసున్ రజిత పేరిట ఉండేది. ఇదే కివీస్ పై వెల్లింగ్టన్ వేదికగా 2018లో జరిగిన టెస్టులో 34 ఓవర్లు వేసి 144 పరుగులిచ్చాడు. ఈ జాబితాలో అశోక డిసిల్వ (56 ఓవర్లు 141 రన్స్), ముత్తయ్య మురళీధరన్ (46 ఓవర్లు 137 రన్స్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.