SRH ఫ్యాన్స్‌ను బయపెడుతున్న కాటెరమ్మ కొడుకు ఫామ్

ఐపీఎల్ 2025 మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ లో క్రికెట్ అభిమానుల అందరి చూపులు ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ పైనే ఉన్నాయి.

Update: 2025-03-21 07:09 GMT
SRH ఫ్యాన్స్‌ను బయపెడుతున్న కాటెరమ్మ కొడుకు ఫామ్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ (IPL) 2025 మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ లో క్రికెట్ అభిమానులందరి (Cricket fans) చూపులు ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) పైనే ఉన్నాయి. గత సీజన్‌లో అన్ని జట్ల బౌలర్లకు సన్ రైజర్స్ బ్యాటర్లు (Sunrisers batters) చుక్కలు చూపించడంతో.. ఐపీఎల్ చరిత్రలో (History of IPL) అత్యధిక పరుగులు నమోదయ్యాయి. దీంతో ఈ సీజన్ లో ఆరెంజ్ ఆర్మీ ఆటపై అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఐపీఎల్ వేలానికి ముందు.. గత సీజన్ లో దుమ్ములేపిన కీలక ప్లేయర్లను SRH జట్టు రిటైన్ చేసుకుంది.

ఇందులో అత్యధికంగా హెన్రిచ్ క్లాసిన్‌ (Heinrich Klaasen)ను 23 కోట్లకు రిటైన్ చేసుకొవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జట్టు యాజమాన్యం అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. గత సీజన్లో క్లాసిన్ (Klaasen) బౌలర్లను ఊచకోత కోయడం తో అతన్ని కాటెరమ్మ కొడుకు అంటూ అభిమానులు పిలుచుకుంటున్నారు. మరికొద్ది గంటల్లో ఐపీఎల్ (IPL) ప్రారంభం కానున్న నేపథ్యంలో.. సన్‌రైజర్స్ అభిమానులకు క్లాసిన్ ఫామ్.. ఆందోళన కలిగిస్తుంది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)లో అతను అనుకున్నంత రాణించలేకపోయారు.

ప్రతి మ్యాచులో క్లాసిన్ కు బ్యాటింగ్ అవకాశం (Batting opportunity) వచ్చినప్పటికి ఒక్క మ్యాచులో కూడా జట్టు విజయానికి తగ్గ స్కోర్ చేయలేకపోయాడు. దీంతో 23 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్న క్లాసిన్ (Klaasen) ఆడకపోతే జట్టు పరిస్థితి ఏంటని అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే క్లాసిన్ స్థానం భర్తీ చేయడానికి సన్ రైజర్స్ జట్టులో యువ ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. తాజా వేళంలో కొనుగోలు చేసిన.. అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, అతర్వ టైడ్, సచిన్ బేబి, Wiaan Mulder లు ఉన్నారని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.


Similar News