ధోనీని గుర్తుచేసిన యంగ్ వికెట్ కీపర్.. మెరుపు వేగంతో రనౌట్

లంక ప్రీమియర్ లీగ్‌లో దంబుల్లా ఆరా, గాలె టైటాన్స్ మధ్య మ్యాచ్‌లో ధోనీ వికెట్ కీపింగ్ స్కిల్స్‌ను అందరూ గుర్తు చేసుకున్నారు.

Update: 2023-08-13 10:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: లంక ప్రీమియర్ లీగ్‌లో దంబుల్లా ఆరా, గాలె టైటాన్స్ మధ్య మ్యాచ్‌లో ధోనీ వికెట్ కీపింగ్ స్కిల్స్‌ను అందరూ గుర్తు చేసుకున్నారు. లంక స్టార్ కుశాల్ మెండిస్.. ధోనీ తరహాలో రనౌట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కుశాల్ ఫీట్ చూసిన అందరూ ధోనీని గుర్తు చేశాడంటూ మెచ్చుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో ఛేజింగ్ చేస్తున్న గాలె టైటాన్స్.. చివరి ఓవర్ ఆడుతోంది. ఈ సమయంలో వికెట్ కీపింగ్ చేస్తున్న దంబుల్ల ప్లేయర్ కుశాల్ మెండిస్.. మెరుపు వేగంతో రనౌట్ చేశాడు. ఫుల్ టాస్ బాల్ ఎదుర్కొన్న లాహిరు సమరకూన్ రెండు పరుగులు తీసేందుకు ప్రయత్నించాడు.

ఈ సమయంలో మెండిస్ అద్భుతమైన కీపింగ్ స్కిల్స్ వల్ల రనౌట్ అయ్యాడు. ఫీల్డర్ నుంచి బంతిని అందుకున్న వెంటనే.. చటుక్కున అండర్ ఆర్మ్ త్రో విసిరాడీ లంక ప్లేయర్. ఆ బంతి వికెట్లను తాకే సమయానికి లాహిరు సమరకూన్.. క్రీజును చేరుకోలేకపోయాడు. వికెట్లకు పక్కగా ఉన్న కుశాల్ మెండిస్.. అంత కరెక్ట్‌గా వాటిని కూల్చడం అంత ఈజీ కాదు. అందుకే అందరూ అతన్ని ఫీట్‌ను ధోనీ వికెట్ కీపింగ్‌తో పోలుస్తూ మెచ్చుకుంటున్నారు. ఇలా కుశాల్ తెలివిగా వికెట్ కీపింగ్ చేయడంతో.. దంబుల్లా టీం ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.


Similar News