రెండో ఇన్నింగ్స్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ నడుస్తొంది. ఇందులో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది.
దిశ, వెబ్‌డెస్క్: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ నడుస్తొంది. ఇందులో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. కాగా ఈ మ్యాచ్ మొదటి రోజు వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో రోజు ప్రారంభం అయిన కొద్ది ఓవర్లకే భారత్ 46 పరుగులకు ఆలౌట్ అయ్యి చెత్త రికార్డును నెలకొల్పింది. అనంతరం ఇంగ్లాండ్ జట్టును 402 పరుగుల వద్ద మూడో రోజు మొదటి సెషన్ ఆలౌట్ చేసింది. కాగా రెండో ఇన్నింగ్స్ భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో కోహ్లీ టెస్ట్ క్రికెట్ కెరీర్ లో 9000 పరుగుల మైలురాయిని అందుకొని చరిత్రలోకి ఎక్కాడు. కాగా కోహ్లీ కంటే ముందు భారత ప్లేయర్లలో సచిన్ టెండూల్కర్ (15921), రాహుల్ ద్రవిడ్ (13265), సునీల్ గవాస్కర్ (10122) తర్వాత టెస్టుల్లో అత్యధిక పరుగులు 9000 చేసిన ప్లేయర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు. విరాట్ కోహ్లీ ఈ మైలురాయిని అందుకోవడం కోసం 197 ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది.