టీమిండియా కంటే ముందే ఆసిస్‌కు రాహుల్.. ఆ జట్టులో చోటు

నేటి నుంచి ఆస్ట్రేలియా ‘ఏ’తో జరగబోయే రెండో అనధికార టెస్టు‌కు ముందు బీసీసీఐ బుధవారం భారత ‘ఏ’ జట్టు స్వల్ప మార్పులు చేసింది.

Update: 2024-11-06 19:03 GMT

దిశ, స్పోర్ట్స్ : నేటి నుంచి ఆస్ట్రేలియా ‘ఏ’తో జరగబోయే రెండో అనధికార టెస్టు‌కు ముందు బీసీసీఐ బుధవారం భారత ‘ఏ’ జట్టు స్వల్ప మార్పులు చేసింది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌లను జట్టులో చేర్చింది. అలాగే, సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపికైన యశ్ దయాల్‌ను జట్టు నుంచి రిలీజ్ చేసింది. అతని స్థానంలో యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను భర్తీ చేసింది. తొలి అనధికార టెస్టులో భారత్‘ఏ’ జట్టు పరాజయం పాలైన విషయం తెలిసిందే. రెండో మ్యాచ్‌లో అభిమన్యు ఈశ్వరన్‌తో కలిసి రాహుల్ ఓపెనింగ్‌ దిగే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే రుతురాజ్ గైక్వాడ్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేయనున్నాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ప్రకటించిన భారత జట్టులో అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్‌, ధ్రువ్ జురెల్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. ఆ సిరీస్‌లో తొలి టెస్టుకు రోహిత్ అందుబాటులో ఉండటంపై అనుమానాలు నెలకొన్నాయి. రోహిత్ దూరమైతే జైశ్వాల్‌‌కు జోడీగా.. ఈశ్వరన్, రాహుల్‌లో ఒకరిని ఓపెనర్‌గా దించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. 

Tags:    

Similar News