సెంచరీల రారాజు క్రికెటర్ విరాట్ కోహ్లీ బర్త్ డే..
నేడు విరాట్ కొహ్లీ 35వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. అతి తక్కువ సమయంలో ఎన్నో రికార్డులు సాధించారు.
దిశ, వెబ్‌డెస్క్: నేడు విరాట్ కొహ్లీ 35వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. అతి తక్కువ సమయంలో ఎన్నో రికార్డులు సాధించారు. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆయన తన 15 ఏళ్ల వయసులోనే క్రికెట్‌లోకి అడుగుపెట్టిన క్రమక్రమంగా అద్భుతంగా ఆడుతూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు. అలాగే సెంచరీలలో రికార్డు సృష్టించాడు. వన్డేలో రెండు శతకాలు చేసిన మూడో భారత బ్యాట్స్‌మన్‌గా విరాట్ నిలిచారు. 2011లో వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుటు కూడా విరాట్ పేరిట ఉన్నాయి. తన కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 20 అవార్డులు దక్కించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్లలో విరాట్ రెండో స్థానంలో ఉన్నాడు. వన్డేలలో 46, టెస్టులో 29, టీ20లో కలిపి మొత్తం 76 సెంచరీలు చేశాడు. నేడు తన పుట్టిన రోజు సందర్భంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగే వరల్డ్ కప్-2023 మ్యాచ్‌లో కోహ్లీ దక్షిణాఫ్రికాతో తలపడేందుకు సిద్ధమయ్యాడు.