IND vs WI: ఇస్మార్ట్ ఇషాన్.. అరంగేట్రంలోనే అదిరిపోయే క్యాచ్..! (వీడియో)

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌తో అరంగేట్రం చేసిన టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అదిరిపోయే క్యాచ్‌తో ఔరా అనిపించాడు.

Update: 2023-07-13 10:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌తో అరంగేట్రం చేసిన టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అదిరిపోయే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. వికెట్ కీపర్‌గా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. స్టన్నింగ్ క్యాచ్‌తో విండీస్ బ్యాటర్ రెయ్‌మాన్ రేమాన్ రైఫర్(2)ను పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు ఇషాన్ కిషన్‌ను ప్రశంసిస్తున్నారు. శార్దూల్ ఠాకూర్ వేసిన 20వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఓవర్ మూడో బంతిని శార్దూల్ ఠాకూర్ మూడో స్టంప్ దిశగా వేయగా.. రెయ్‌మాన్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి 'లో క్యాచ్‌'గా కీపర్ వైపు దూసుకెళ్లింది. సూపర్ డైవ్‌తో ఇషాన్ కిషన్ అద్భుతంగా అందుకున్నాడు. అయితే క్యాచ్ అందుకునే క్రమంలో బంతి నేలకు తాకిందా? లేదా? అనేది స్పష్టంగా లేకపోవడంతో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ సమీక్ష కోరారు. రీప్లేలను పలు కోణాల్లో పరిశీలించిన థర్డ్ అంపైర్.. బంతిని అందుకునే క్రమంలో ఇషాన్ గ్లోవ్స్ కింద ఉండటం గుర్తించి ఔటిచ్చాడు. అదిరిపోయే క్యాచ్‌తో ఇషాన్ కిషన్ సుదీర్ఘ ఫార్మాట్‌లో ఖాతా తెరిచాడు.


Similar News