Rohit Sharma: 'అతడికి టాలెంట్‌ ఉంది.. వరుస అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉంది'

టీమిండియా యువ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌‌పై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Update: 2023-07-20 11:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా యువ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌‌పై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్‌ ప్రతిభావంతుడైన ఆటగాడు. టీమిండియా తరఫున ఏడాదిన్నర కెరీర్‌లో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్బుతంగా రాణించాడు. వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించాడు. ఇలాంటి టాలెంట్‌ ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహించడం మన బాధ్యత అని రోహిత్‌ శర్మ అన్నాడు. అతడికి మేము కచ్చితంగా అవకాశాలు ఇవ్వాలి. ముఖ్యంగా లెఫ్టాండ్‌ బ్యాటర్‌.. కాబట్టి అతడి వైపు మొగ్గుచూపాల్సి వస్తోంది.

అతడికి దూకుడుగా ఆడటం ఇష్టం. అయితే, మేనేజ్‌మెంట్‌ తను ఎలా ఆడాలని కోరుకుంటుందో స్పష్టంగా వివరించాను. ఇషాన్‌ రాణించగల సత్తా ఉన్నవాడు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్‌ బ్యాటర్‌గా ఆకట్టుకోలేకపోయినా వికెట్‌ కీపర్‌గా ఫర్వాలేదనిపించాడు. అతడికి కాస్త ఫ్రీడం ఇచ్చి.. వరుస అవకాశాలు ఇస్తే తనను తాను నిరూపించుకుంటాడు. విండీస్‌తో తొలి టెస్టులో అతడి వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యాలు నన్ను ఆకట్టుకున్నాయి అని రోహిత్‌ శర్మ తెలిపారు.


Similar News