దిశ, వెబ్‌డెస్క్: డిసెంబర్, జనవరిలో భారత క్రికెట్ జట్టు.. సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ అధికారికంగా విడుదల చేసింది. మూడు ఫార్మాట్ల సిరీస్‌లు జరిగే ఈ పర్యటనలో తొలుత 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఆ తర్వాత 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, ఆఖర్లో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగనుంది. సౌతాఫ్రికాలో టీమిండియా పర్యటన 2024 జనవరి 7తో ముగియనుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగే 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ఫ్రీడం సిరీస్‌గా నామకరణం చేయబడింది.
సౌతాఫ్రికాలో భారత పర్యటన షెడ్యూల్ వివరాలు..
టీ20 సిరీస్..
డిసెంబర్ 10: తొలి టీ20 (డర్బన్)
డిసెంబర్ 12: రెండో టీ20 (గ్వేబెర్హా)
డిసెంబర్ 14: మూడో టీ20 (జోహనెస్బర్గ్)
వన్డే సిరీస్..
డిసెంబర్ 17: తొలి వన్డే (జోహనెస్బర్గ్)
డిసెంబర్ 19: రెండో వన్డే (గ్వేబెర్హా)
డిసెంబర్ 21: మూడో వన్డే (పార్ల్)
ఫ్రీడం సిరీస్..
డిసెంబర్ 26 నుంచి 30: తొలి టెస్ట్ (సెంచూరియన్)
2024 జనవరి 3 నుంచి 7: రెండో టెస్ట్ (కేప్‌టౌన్)
BCCI and @ProteasMenCSA announce fixtures for India’s Tour of South Africa 2023-24.
— BCCI (@BCCI) July 14, 2023
For more details - https://t.co/PU1LPAz49I #SAvIND
A look at the fixtures below 👇👇 pic.twitter.com/ubtB4CxXYX