న్యూఢిల్లీ : మలేసియాలో డిసెంబర్ 5 నుంచి 16 తేదీల మధ్య జరగబోయే ఎఫ్‌ఐహెచ్ పురుషుల జూనియర్ హాకీ వరల్డ్ కప్‌కు హాకీ ఇండియా మంగళవారం జట్టును ఎంపిక చేసింది. ఉత్తమ సింగ్ నేతృత్వంలో 18 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. అరైజీత్ సింగ్ హుండాల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించగా..హెచ్ఎస్ మోహిత్, రణ్‌విజయ్ సింగ్ గోల్ కీపర్లుగా ఎంపికయ్యారు. కెనడా, కొరియా, స్పెయిన్ జట్లతో కలిసి భారత్ పూల్-సి గ్రూపులో భాగమైంది. డిసెంబర్ 5న కొరియాతో తలపడటంతో భారత్ టోర్నీని ప్రారంభించనుంది. ఆ తర్వాత 7న స్పెయిన్‌తో, 9న కెనడాతో ఆడనుంది. కాగా, 2001, 2016లో చాంపియన్‌గా నిలిచిన భారత్.. గత ఎడిషన్ 2021లో నాలుగో స్థానంతో సరిపెట్టింది. ఈ సారి టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నది.
భారత జట్టు :
గోల్‌కీపర్స్ : మోహిత్, రణ్‌విజయ్ సింగ్, డిఫెండర్స్ : శారదానంద్ తివారీ, అమన్‌దీప్, రోహిత్, సునీల్, అమీర్ అలీ,
మిడ్‌ఫీల్డర్స్ : విష్ణుకాంత్, పూవన్న, రాజిందర్ సింగ్, అమన్‌దీప్, ఆదిత్య, ఫార్వాడ్స్ : ఉత్తమ్ సింగ్(కెప్టెన్), ఆదిత్య, అరైజిత్ సింగ్(వైస్ కెప్టెన్), సౌరభ్, సుదీప్, బాబీ సింగ్.
రిప్లేస్‌మెంట్ అథ్లెట్స్ : సుఖ్విందర్, సునిత్ లక్రా.