India vs West Indies 2nd Test Day 1: టాస్ గెలిచిన వెస్టిండీస్‌..

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా జరగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్‌ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

Update: 2023-07-20 13:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా జరగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్‌ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. విండీస్‌ రెండు మార్పులతో బరిలోకి దిగింది. యువ బ్యాటర్‌ కిర్క్ మెకెంజీ డెబ్యూ చేయగా.. పేసర్‌ షానన్ గాబ్రియెల్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు టీమిండియా ఒకే ఒక మార్పుతో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు శార్ధూల్‌ ఠాకూర్‌ గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో బెంగాల్‌ పేసర్‌ ముఖేష్‌ కుమార్‌ టెస్టుల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. విండీస్‌పై తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన భారత జట్టు.. రెండో టెస్టులో కూడా బలమైన ప్రదర్శన చేసేందుకు రెడీ అవుతోంది.

ఏకపక్షంగా సాగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మరో విజయంతో క్లీన్‌స్వీప్‌ చేయాలని టీమిండియా చూస్తుండగా.. సొంతగడ్డపై కాస్త మెరుగైన ప్రదర్శనతో పరువు కాపాడుకోవాలని విండీస్‌ భావిస్తోంది. వెస్టిండీస్‌, భారత్ జట్లకు ఈ టెస్ట్ మ్యాచ్ ప్రత్యేకంగా నిలవనుంది. ఎందుకంటే ఇరు జట్ల మధ్య ఇది 100వ టెస్టు మ్యాచ్. మరి ఈ ప్రత్యేక మ్యాచ్‌లో అయినా కరీబియన్‌ జట్టు రోహిత్‌ సేనకు పోటీ ఇస్తుందా..? సిరీస్‌లో వైట్‌వాష్‌ను తప్పించుకుంటుందా..? చూడాలి. 

వెస్టిండీస్ (ప్లేయింగ్ XI):

క్రైగ్ బ్రాత్‌వైట్ (సి), టాగెనరైన్ చంద్రపాల్, కిర్క్ మెకెంజీ, జెర్మైన్ బ్లాక్‌వుడ్, అలిక్ అథానాజ్, జాషువా డా సిల్వా (w), జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కెమర్ రోచ్, జోమెల్ వారికన్, షానన్ గాబ్రియెల్

భారత్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్(w), రవిచంద్రన్ అశ్విన్, జయదేవ్ ఉనద్కత్, ముఖేష్ కుమార్, మహ్మద్ సిరాజ్


Similar News