India vs West Indies 1st Test: లంచ్ బ్రేక్.. తొలి సెషన్‌లో ఆధిక్యం మనదే..

డొమినికా టెస్టులో టీమిండియాకి శుభారంభం దక్కింది.

Update: 2023-07-12 16:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: డొమినికా టెస్టులో టీమిండియాకి శుభారంభం దక్కింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టు లంచ్ బ్రేక్ సమయానికి 28 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. మొదటి 12 ఓవర్లలో వికెట్ ఇవ్వకుండా బ్యాటింగ్ చేసిన విండీస్.. ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. 12.5 ఓవర్లలో తొలి వికెట్‌కి 31 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత తొలి వికెట్ కోల్పోయింది వెస్టిండీస్. 44 బంతుల్లో 12 పరుగులు చేసిన టగెనరైన్ చంద్రపాల్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

2011లో శివ్‌నరైన్ చంద్రపాల్‌ని  ఔట్ చేసిన రవిచంద్రన్ అశ్విన్, 2023లో అతని కొడుకు టగెనరైన్ చంద్రపాల్‌ని ఔట్ చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో తండ్రీకొడుకులను ఔట్  చేసిన మొట్టమొదటి భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు అశ్విన్. ఓవరాల్‌గా టెస్టు క్రికెట్ చరిత్రలో తండ్రీకొడుకులను ఔట్ చేసిన ఐదో బౌలర్ నిలిచాడు. ఇంతకుముందు ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్ ఇద్దరూ కూడా న్యూజిలాండ్ తండ్రీకొడుకులు లాన్స్ కెయిర్న్స్, క్రిస్ కెయిర్న్స్‌లను ఔట్ చేయగా.. మిచెల్ స్టార్క్, సిమాన్ హర్మన్ ఇద్దరూ కూడా శివ్‌నరైన్ చంద్రపాల్‌తో పాటు టగెనరైన్ చంద్రపాల్‌లను ఔట్ చేశారు.


Similar News