3000 సిక్సర్లతో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన భారత్

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో భారత్ భారీ స్కోరు చేసింది. ముఖ్యంగా యువ బ్యాటర్లు అయిన గిల్, శ్రేయస్, రాహుల్, కిషాన్, సూర్యకుమార్ యాదవ్, ఆస్ట్రేలియా బౌలర్లపై ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడ్డారు.

Update: 2023-09-24 14:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో భారత్ భారీ స్కోరు చేసింది. ముఖ్యంగా యువ బ్యాటర్లు అయిన గిల్, శ్రేయస్, రాహుల్, కిషాన్, సూర్యకుమార్ యాదవ్, ఆస్ట్రేలియా బౌలర్లపై ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడ్డారు. దీంతో భారత్ వన్డే మ్యాచుల చరిత్రలో 3000 సిక్సులు కొట్టిన జట్టుగా పేరును నమోదు చేసుకుంది. దీంతో వన్డేల్లో 3000 సిక్సర్లు కొట్టిన జట్టుగా ప్రపంచ రికార్డును భారత్ బద్దలు కొట్టింది. కాగా ఈ రోజు ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత బ్యాటర్లు 18 సిక్సర్లు కొట్టారు.

Tags:    

Similar News