IND vs WI team squad 2023 : ఓపెనర్‌గా యశస్వి జైశ్వాల్.. మూడో స్థానంలో గిల్
మరి కొన్ని గంటల్లో విండీస్‌తో టీమ్ఇండియా తొలి టెస్టు ఆడనుంది.
దిశ, వెబ్‌డెస్క్: మరి కొన్ని గంటల్లో విండీస్‌తో టీమ్ఇండియా తొలి టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్‌తో యశస్వి జైశ్వాల్ టెస్ట్ అరంగేట్రం చేయనున్నాడు. గిల్మూడో స్థానంలో రానున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో మంచి ప్రదర్శన చేసి జాతీయ జట్టుకు ఎంపికైన యశస్వి జైస్వాల్.. టెస్ట్ అరంగేట్రం చేయబోతున్నాడు. మరి కొన్ని గంటల్లో వెస్టిండీస్‌తో ప్రారంభం కానున్న మొదటి టెస్టులో అతడు ఓపెనర్‌గా దిగబోతున్నాడు.
ఈ విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. దీంతో హిట్ మ్యాన్-యశస్వి కలిసి ఓపెనర్లుగా బరిలో దిగబోతున్నారు. డబ్ల్యూటీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్న యశస్వికి.. అప్పుడు ఆడే ఛాన్స్ దక్కలేదు. కానీ ఈ సారి విండీస్పర్యటనకు ఎంపికవ్వడంతో పాటు మొదటి టెస్టులోనే ఆడే అవకాశం దక్కించుకోవడం విశేషం. 2021లో ఆస్ట్రేలియాపై టెస్ట్ అరంగేట్రం చేసిన శుభమన్‌గిల్.. అప్పటి నుంచి ఓపెనర్‌గానే బరిలో దిగుతున్నాడు. అయితే ఈ సారి యశస్వి ఓపెనర్‌గా ఎంట్రీ ఇవ్వడంతో.. గిల్మూడో స్థానంలో ఆడనున్నట్లు హిట్మ్యాన్పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగబోతున్నట్లు రోహిత్ చెప్పాడు.