Ind Vs WI 2nd Test: ఐదో రోజు ఆటకు వర్షం ఆటంకం..

Update: 2023-07-24 14:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్‌- టీమిండియా మధ్య రెండో టెస్టు ఐదో రోజు ఆటకు వరణుడు అంతరాయం కలిగించాడు. దీంతో ఆఖరి రోజు ఆట ఆలస్యంగా మొదలుకానుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత జట్టు డొమినికా టెస్టులో విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో టెస్టులో టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌ 438 పరుగుల వద్ద ముగించింది. వెస్టిండీస్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను 255 పరుగులకు ఆలౌట్‌ అయింది.

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఐదు వికెట్లతో చెలరేగగా.. రవీంద్ర జడేజా, ముకేశ్‌ కుమార్‌ చెరో 2, అశ్విన్‌ 1 వికెట్‌ పడగొట్టారు. 183 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన రోహిత్‌ సేన.. 181-2 వద్ద డిక్లేర్‌ చేసింది. ఈ క్రమంలో నాలుగో రోజు ఆట ముగిసే సరికి విండీస్‌ రెండు వికెట్ల నష్టానికి 76 పరుగులు సాధించింది. టీమిండియా చేతిలో క్లీన్‌స్వీప్‌ నుంచి తప్పించుకోవాలంటే ఆఖరి రోజు విండీస్‌ 289 పరుగులు చేయాలి. అదే విధంగా రోహిత్‌ సేన 2-0తో విజయం సంపూర్ణం చేసుకోవాలంటే 8 వికెట్లు పడగొట్టాలి.


Similar News