Ind Vs WI: చెలరేగిన అశ్విన్.. అరుదైన రికార్డు బద్దలు
వెస్టిండీస్‌తో తొలి టెస్టు సందర్భంగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు.
దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్‌తో తొలి టెస్టు సందర్భంగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. డొమినికా వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వెస్టిండీస్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో అశ్విన్ అద్భుత బౌలింగ్‌తో తగెనరైన్ చందర్‌పాల్‌ను బౌల్డ్ చేశాడు. దీంతో అశ్విన్ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది.
టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు బౌల్డ్ చేయడం ద్వారా సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేశాడు. అనిల్ కుంబ్లే 94 సార్లు ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను బౌల్డ్ చేయగా.. అశ్విన్.. చందర్‌పాల్ వికెట్‌తో తన నెంబర్‌ను 95గా నమోదు చేశాడు. ఇక మహ్మద్ షమీ 66 సార్లు, కపిల్ దేవ్ 88 సార్లు ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను బౌల్డ్ చేశారు. 17 ఓవర్లు ముగిసేసరికి విండీస్ 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.