IND vs BAN 1st Test: విజృంభించిన భారత బౌలర్లు.. 149 పరుగుల బంగ్లా ఆలౌట్

భారత్, బంగ్లాదేశ్ మధ్య చెన్నై వేదికగా మొదటి టెస్ట్ (IND vs BAN 1st టెస్ట్) మ్యాచ్ జరుగుతుంది.

Update: 2024-09-20 10:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్, బంగ్లాదేశ్ మధ్య చెన్నై వేదికగా మొదటి టెస్ట్ (IND vs BAN 1st టెస్ట్) మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ రెండో రోజు మొదటి సెషన్ ప్రారంభంలోనే 376 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ వచ్చిన బంగ్లా‌దేశ్ (Bangladesh) బ్యాటర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. బుమ్రా 4, సిరజ్ 2, ఆకాష్ దీప్ 2, జడేజా 2 వికెట్లు తీసుకున్నారు. దీంతో బంగ్లాదేశ్ కేవలం 47.1 ఓవర్లకు ఒక్క సెషన్ లోనే 149 పరుగులకు ఆలౌట్ అయ్యారు. బంగ్లా బ్యాటర్లలో షాన్టో 20, షాకిబ్ 32, లిటన్ దాస్ 22, మెహది హసన్ 27 పరుగులు చేశారు. కాగా మొదటి ఇన్నింగ్స్ లో భారత్(India) ఏకంగా 227 పరుగుల లీడ్ దక్కగా.. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది.


Similar News