IND vs BAN, 1st Test: ముగిసిన రెండో రోజు ఆట.. భారీ ఆధిక్యంలో భారత్

భారత్, బంగ్లాదేశ్ మధ్య చెన్నై వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట భారత్ బ్యాటింగ్ చేసింది.

Update: 2024-09-20 12:01 GMT

దిశ, వెబ్ డెస్క్: భారత్, బంగ్లాదేశ్ మధ్య చెన్నై వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట భారత్ బ్యాటింగ్ చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో జైస్వాల్, పంత్, అశ్విన్, జడేజా రాణించడంతో భారత్ రెండో రోజు మొదటి సెషన్‌లో 376 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన బంగ్లా బ్యాటర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో కేవలం 149 పరుగులకే బంగ్లా ఆలౌట్ అయింది. దీంతో భారత్ 227 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 23 ఓవర్లు ఆడిన భారత్ 3 వికెట్లను కోల్పోయి 81 పరుగులు చేసింది. దీంతో భారత్ మొత్తం 308 పరుగుల ఆధిక్యంలో ఉంది. కాగా ప్రస్తుతం గిల్ 33, రిషబ్ పంత్ 12 పరుగులతో క్రీజ్‌లో కొనసాగుతున్నారు.


Similar News