Jasprit Bumrah: టీమిండియా పేసర్ నయా రికార్డు.. 400 వికెట్ల క్లబ్‌లోకి బుమ్రా

టీమిండియా యువ పేసర్ బుమ్రా మరో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

Update: 2024-09-20 10:43 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టీమిండియా యువ పేసర్ బుమ్రా మరో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. బౌలర్ గా 400 వికెట్ల మైలు రాయిని చేరుకున్నాడు. చెన్నై వేదికగా భారత్- బంగ్లాదేశ్ దేశాల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఇవాల రెండవ ఇన్నింగ్స్ కొనసాగుతోంది. ఇందులో భారత ఫేస్ బౌలర్ జాస్పిత్ బుమ్రా నాలుగు వికెట్లు తీశాడు. దీంతో బుమ్రా అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లలో 400 వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన పదో ఇండియన్ బౌలర్ గా బుమ్రా రికార్డుకెక్కాడు. అంతేగాక ఇప్పటివరకు మొత్తం 12 సార్లు ఐదు వికెట్లు సాధించిన రికార్డు బుమ్రా పేరుపై ఉండగా.. ఈ మ్యాచ్ లో మరో వికెట్ తీస్తే ఆ రికార్డు 13 కు చేరుకుంటుంది. కాగా టీ౨౦ ప్రపంచ కప్ తర్వాత సెలవులో ఉన్న బుమ్రా.. తన సెలవు రద్దు చేసుకొని భారత్ బంగ్లా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ కు ఆడేందుకు వచ్చాడు.  


Similar News