భారత్‌కు 33 పతకాలు.. ఆసియా యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్
ఖతార్ రాజధాని దోహలో జరుగుతున్న ఆసియన్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్‌లో భారత్ 33 పథకాలు సాధించి తన ప్రస్థానాన్ని ముగించింది.
దిశ, స్పోర్ట్స్ : ఖతార్ రాజధాని దోహలో జరుగుతున్న ఆసియన్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్‌లో భారత్ 33 పథకాలు సాధించి తన ప్రస్థానాన్ని ముగించింది. 40 కేటగిరీలలో భారత్ ఈ మెడల్స్ సాధించింది. ఇండియన్ యూత్ లిఫర్ట్స్(13 నుంచి 17 ఏళ్లు) విభాగంలో 21 మెడల్స్ సాధించారు. ఇందులో 7 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. జూనియర్ లిఫ్టర్స్ (15 నుంచి 20 ఏళ్లు) విభాగంలో మొత్తం 12 మెడల్స్‌ను సాధించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన16 ఏళ్ల జ్యోత్స్న సబర్ 40 కేజీల విభాగంలో మూడు బంగారు పతకాలు సాధించింది. 60 కేజీలు(స్నాచ్, 75( కేజీ(క్లీన్ అండ్ జెర్క్)ల విభాగంలో ఈ ఫీట్ సాధించింది. తద్వారా ఆసియా ఆటగాళ్లలో ఈ ఘనత సాధించిన తొలి క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. జూనియర్, యూత్ కేటగిరీల్లో పాయల్(45కేజీలు), సంజన్ (మహిళల 76 కేజీ)ల విభాగంలో ఒక్కొక్కరు ఐదు మెడల్స్ సాధించారు. గతేడాది నోయిడాలో జరిగిన ఆసియన్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్‌లో భారత్ 42 మెడల్స్ సాధించింది.