AUS vs IND, 4th Test:టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా.. హీట్ పెంచిన కోహ్లీ
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా నేడు నాలుగో టెస్ట్ ఈ రోజు తెల్లవారుజామున ప్రారంభం అయింది.
దిశ, వెబ్ డెస్క్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా నేడు నాలుగో టెస్ట్ ఈ రోజు తెల్లవారుజామున ప్రారంభం అయింది. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి మూడు మ్యాచుల్లో చెరో విజయం సాధించగా.. ఒక మ్యాట్ డ్రాగా ముగిసింది. కాగా సిరీస్ గెలవాలంటే ఇందులో కచ్చితంగా గెలవాల్సి ఉండగా.. ఇరు జట్లు టెస్ట్ టైటిల్ లక్ష్యంగా రంగంలోకి దిగాయి. ఈ క్రమంలోనే ఇరు జట్లు స్వల్ప మార్పులతో జట్లను ప్రకటించాగా.. భారత జట్టు గిల్ స్థానంలో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను జట్టులోకి తీసుకుంది. అలాగే ఆస్ట్రేలియా జట్టు యువ బ్యాటర్ కొట్సస్‌ను తీసుకొచ్చింది.
ఆదిలోనే హీట్ పెంచిన విరాట్ కోహ్లీ
కాగా ఈ మ్యాచ్ ప్రారంభంలోనే విరాట్ కోహ్లీ హీట్ పెంచారు. ఆస్ట్రేలియా జట్టులోకి వచ్చిన 19 యువ ప్లేయర్‌ను విరాట్ స్లెడ్జ్ చేయడం ప్రారంభించాడు. కొట్సస్ కోహ్లీ భుజాన్ని తాకుతూ వెళ్లాడు. ఈ క్రమంలో ఇరువురి ప్లేయర్ల మధ్య వాగ్వాదం నెలకొనగా.. అంపైర్లు కల్పించుకొని గొడవను సద్దుమణిగేలా చేశారు. అనంతరం భారత బౌలర్లపై రెచ్చిపోయిన కొట్సస్.. వరుస బౌండరీలతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా అతన్ని రవీంద్ర జడేజా 60 పరుగుల వద్ద అవుట్ చేశారు. కాగా ఈ టెస్టులో మొదటి సెషన్ లో లంచ్ బ్రేక్ ఇవ్వగా.. 25 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా జట్టు 1 వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్ ఖవాజా 38, లబుశ్చగానే 12పరుగులతో ఉన్నారు.
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మార్నస్ లాబుస్చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ(w), పాట్ కమిన్స్(c), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్
భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(సి), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్