Rohit Sharma : ఓపెనర్‌గా రోహిత్ శర్మ.. టీం ఇండియా అసిస్టెంట్ కోచ్ క్లారిటీ

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాల్గో టెస్ట్‌లో రోహిత్ శర్మ ఓపెనింగ్‌కు వస్తాడని భారత జట్టు అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ కన్ఫార్మ్ చేశాడు.

Update: 2024-12-26 12:15 GMT

దిశ, స్పోర్ట్స్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాల్గో టెస్ట్‌లో రోహిత్ శర్మ ఓపెనింగ్‌కు వస్తాడని భారత జట్టు అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ కన్ఫార్మ్ చేశాడు. బాక్సింగ్ డే టెస్ట్ తొలి రోజు ఆట ముగిసిన తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడాడు. ‘రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. కేఎల్ రాహుల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. శుభ్ మన్ గిల్‌ను కావాలని డ్రాప్ చేయలేదు. కానీ అతడికి సరైన ఆరంభం లభించలేదు. జట్టు నుంచి తప్పించడాన్ని అతను అర్థం చేసుకుంటాడు.’ అని నాయర్ అన్నాడు. వ్యక్తిగత కారణాలతో రోహిత్ తొలి టెస్ట్‌లో ఆడలేదు. ఆరేళ్ల తర్వాత రోహిత్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. అయితే భారత్ చేసిన ఈ ప్రయోగం విఫలం అయింది. బ్రిస్బేన్, అడిలైడ్ టెస్ట్‌ల్లో మూడు ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ విజయం తర్వాత రోహిత్ కెప్టెన్‌గా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. అయితే బాక్సిండ్ టెస్ట్‌లో గెలిచి వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ పాయింట్ల పట్టికలో టాప్-2కు చేరుకోవాలని భారత్ భావిస్తోంది.

Tags:    

Similar News