IND Vs BAN: విజృంభించిన భారత పేసర్లు.. పీకల్లోతు కష్టాల్లో బంగ్లా జట్టు

చెన్నైలోని ఎంఏ చిదంబరం (MA Chidambaram Stadium) స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌ (Bangladesh)తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా (Team India) 376 పరుగులకు ఆలౌటైంది.

Update: 2024-09-20 07:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: చెన్నైలోని ఎంఏ చిదంబరం (MA Chidambaram Stadium) స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌ (Bangladesh)తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా (Team India) 376 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాట్స్‌మెన్లలో రవిచంద్రన్ అశ్విన్ (113), రవీంద్ర జడేజా (86), యశస్వి జైస్వాల్ (56), రిషభ్‌ పంత్ (39) సంయమనంతో ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించారు. ఇక బంగ్లా బౌలర్లలో హసన్ మహ్మద్ (Hasan Mohammad) చక్కని బౌలింగ్ లైనప్‌తో టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. రోహిత్ శర్మ, శుభ్‌‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్‌లను మ్యాజికల్ బంతులతో పెవీలియన్‌కు పంపాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ (Bangladesh) జట్టు 9 ఓవర్లలో 3 కీలక వికెట్లు కోల్పోయింది. షాద్మాన్‌ ఇస్లాం‌ను (2)ను బూమ్రా పెవిలియన్‌కు పంపగా, 8వ ఓవర్‌లో జకీర్‌ హసన్‌ (3), మోమినుల్‌ హక్‌ (0)ను ఆకాష్‌ దీప్‌ క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ లంచ్‌ బ్రేక్‌ సమయానికి 3 వికెట్లను కోల్పోయి 26 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. నజాముల్‌ హుస్సేన్‌ శాంటో (15), ముష్ఫికర్‌ రహీమ్‌ (4) పరుగులతో క్రీజులో ఉన్నారు.


Similar News