IND Vs AUS: బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత్ ఘోర పరాజయం.. పేకమేడలా కూలిన బ్యాటింగ్ ఆర్డర్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 (Border-Gavaskar Trophy 2024)లో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ (Melbourne) వేదికగా జరుగుతోన్న బాక్సింగ్ డే టెస్ట్‌లో 184 పరుగుల తేడాతో భారత్ ఘోర పరాజయం పాలైంది.
దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 (Border-Gavaskar Trophy 2024)లో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ (Melbourne) వేదికగా జరుగుతోన్న బాక్సింగ్ డే టెస్ట్‌లో 184 పరుగుల తేడాతో భారత్ ఘోర పరాజయం పాలైంది. రెండో ఇన్సింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌట్ అయిన కంగారూ జట్టు టీమిండియా (Team India)కు 340 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఆసిస్ బ్యాట్స్మెన్లలో మార్నస్ లబుషేన్ (Marnus Labuschagne) 70, పాట్ కమిన్స్ (Pat Cummins) (41), నాథల్ లయన్ (Nathan Lyon) (41) పరుగులు చేశారు. భారత బౌలర్లలో జస్ర్పీత్ బుమ్రా (Jasrpeet Bumrah) 5, మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) 3, రవీంద్ర జడేజా (Ravindra Jadeja) 1 వికెట్ తీసుకున్నారు.
పేకమేడలా కూలిన బ్యాటింగ్ ఆర్డర్
340 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ (India)కు ఆదిలోని భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) (9), కేఎల్ రాహుల్ (KL Rahul), కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) బౌలింగ్‌లో పెవీలియన్ చేరారు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా (5) పరుగులకే మిచెల్ స్టార్క్ (Mitchell Starc) బౌలింగ్ క్యాచ్ అవుటయ్యాడు. మరో ఎండ్‌లో ఉన్న ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (84) నిదానంగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. కీపర్ రిషభ్ పంత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు యత్నించాడు. ఇంతలోనే రిషభ్ పంత్ (30) ట్రావిస్ హెడ్‌కు చిక్కాడు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ సింగ్ డిజిట్‌కే అవుటవ్వడంతో ఆసిస్, భారత్‌పై 184 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆసిస్ బౌలర్లలో కెప్టెన్ పాట్ కమిన్స్ 3, స్కాట్ బోలాండ్ 3, నాథన్ లయన్ 2, మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్ చెరో వికెట్ తీసుకున్నారు. టీమిండియా ఈ టెస్ట్‌లో ఓడిపోవడంతో దాదాపు WTC ఫైనల్‌కు దారులు అన్ని మూసుకుపోయినట్లేనని క్రీడా పండితులు అంటున్నారు.