రోహిత్.. తప్పులు సరిదిద్దుకో.. హిట్‌మ్యాన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన గంగూలీ

టెస్టుల్లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఆందోళన వ్యక్తం చేశాడు.

Update: 2025-03-17 19:53 GMT
రోహిత్.. తప్పులు సరిదిద్దుకో.. హిట్‌మ్యాన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన గంగూలీ
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్ : టెస్టుల్లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఆందోళన వ్యక్తం చేశాడు. టెస్టుల్లో తప్పులు సరిదిద్దుకుని, మెరుగైన ప్రదర్శన చేయాలని సూచించాడు. తాజాగా ఇంటర్వ్యూలో గంగూలీ.. రోహిత్ టెస్టు ఫామ్‌పై స్పందించాడు. ‘4-5 ఏళ్లుగా రెడ్ బాల్ క్రికెట్‌లో రోహిత్ ఫామ్ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకంటే బాగా ఆడగలడు. దీని గురించి అతను ఆలోచించాలి. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఉంది. ఇది చాలా కష్టతరమైన సిరీస్. పరిమిత ఓవర్లలో రోహిత్ గొప్ప ఆటగాడు. కానీ, టెస్టుల్లో అతను రాణించాల్సిన అవసరం ఉంది. కెప్టెన్‌గా అతను అద్భుతమైన సారథి అని నేను ఎప్పుడూ చెబుతుంటా. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో జట్టును అతను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లినా నేను ఆశ్చర్యపడను. టెస్టు క్రికెట్ అతను ఆడతాడో లేదో నాకు తెలియదు. అతను మాట వింటుంటే రెడ్ బాల్ క్రికెట్‌లో బాధ్యత తీసుకోవాలి. ఇటీవల టెస్టుల్లో భారత్ గొప్పగా ఆడలేదు. ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ చాలా కీలకం. ఆ సిరీస్‌లో జట్టును ముందుకు తీసుకెళ్లడానికి రోహిత్ ఏదైనా మార్గం వెతకాలి.’అని గంగూలీ చెప్పుకొచ్చాడు.


Tags:    

Similar News