Hardik Pandya: భార్యతో విడాకులు ప్రకటించిన హర్ధిక్ పాండ్యా

టీ20 వరల్డ్ విన్నింగ్ హీరో హర్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే టీ20 వరల్డ్ కప్ సమయంలో ఈ ఇష్యూ కాస్త సర్ధుమనిగింది.

Update: 2024-07-18 16:15 GMT

దిశ, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ విన్నింగ్ హీరో హర్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే టీ20 వరల్డ్ కప్ సమయంలో ఈ ఇష్యూ కాస్త సర్ధుమనిగింది. అయితే ఎవరూ ఊహించని విధంగా గురువారం రాత్రి వారు 4 సంవత్సరాల వివాహం బంధం నుంచి విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా హర్ధిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిక్ నుండి విడిపోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ప్రకటించాడు. కాగా వీరికి మే 31, 2020 న ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం జరిగింది. ఈ సందర్భంగా వారు విడివిడి చేసిన పోస్టుల్లో.. "మేం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇది మాకు కఠినమైన నిర్ణయం. అగస్త్యకు మంచి కో-పేరెంట్స్ గా ఉంటాం. ఈ కష్ట సమయంలో మా గోప్యతను మీరు గౌరవిస్తూ.. మద్దతివ్వాలని కోరుకుంటున్నామని రాసుకొచ్చారు.

Tags:    

Similar News