PV Sindhu : ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ.. పీవీ సింధుకు ఈజీ డ్రా

ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధుకు ఈజీ డ్రా లభించింది.

Update: 2025-01-07 15:57 GMT

దిశ, స్పోర్ట్స్ : ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధుకు ఈజీ డ్రా లభించింది. ఈ టోర్నీ న్యూఢిల్లీలోని కేడీ జాదవ్ హాల్‌లో జనవరి 14 నుంచి ప్రారంభం కానుంది. వుమెన్స్ సింగిల్స్‌లో భారత్ తరఫున బెస్ట్ ప్లేయర్‌గా ఉన్న పీవీ సింధుపైనే అందరి దృష్టి ఉంది. అయితే ఫస్ట్ రౌండ్‌లో పీవీ సింధు భారత్‌కే చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అనుపమ ఉపాధ్యాయతో తలపడనుంది. ఈ టోర్నీలో లక్ష్యసేన్ చైనాకు చెందిన హాంగ్ యాంగ్ వెంగ్‌తో తొలి రౌండ్‌లో తలపడనున్నాడు. ప్రియాంన్షు రజావత్ తొలి రౌండర్‌లో జపాన్ కు చెందిన కొడాయ్ రొకాతో తలపడనున్నాడు. మరో బ్యాడ్మింటన్ ఆటగాడు ప్రణయ్ థాయ్‌లాండ్‌కు చెందిన సు లీ యాంగ్ తో తలపడనున్నాడు. వివాహం తర్వాత పీవీ సింధు తలపడే తొలి టోర్నీ ఇదే కావడం విశేషం. ఈ టోర్నీలో మొత్తం 21 మంది భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు పాల్గొననున్నారు. విజేతలకు సుమారు రూ.8కోట్ల 14లక్షల వరకు ప్రైజ్ మనీగా అందించనున్నారు. 

Tags:    

Similar News