భారత అథ్లెటిక్స్ సమాఖ్య ప్రెసిడెంట్‌గా బహదూర్ సింగ్
భారత అథ్లెటిక్స్ సమాఖ్య(ఏఎఫ్ఐ) అధ్యక్షుడిగా ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ బహదూర్ సింగ్ సాగూ ఎన్నికయ్యారు.
దిశ, స్పోర్ట్స్ : భారత అథ్లెటిక్స్ సమాఖ్య(ఏఎఫ్ఐ) అధ్యక్షుడిగా ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ బహదూర్ సింగ్ సాగూ ఎన్నికయ్యారు. మంగళవారం చండీగఢ్‌లో జరిగిన ఏఎఫ్ఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో సాగూను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అంజు బాబీ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో దశాబ్దానికిపైగా ఏఎఫ్ఐ ప్రెసిడెంట్‌గా కొనసాగిన ఆదిల్లే సుమరివాలా ప్రస్థానం ముగిసింది. సుమరివాలా నుంచి సాగూ బాధ్యతలు అందుకోనున్నారు. నాలుగేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు. సీనియర్ జాయింట్ సెక్రెటరీగా ఉన్న సందీప్ మెహతా సెక్రెటరీగా ఎన్నికవ్వగా.. కోశాధికారి పదవి స్టాన్లీ జోన్స్‌కు దక్కింది. కాగా, బహదూర్ సింగ్ 2002 బుసాన్ ఏషియన్ గేమ్స్‌లో షాట్‌పుట్‌లో స్వర్ణ పతకం సాధించారు. అలాగే, 2000, 2004 ఒలింపిక్స్‌ల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఏఎఫ్ఐ అథ్లెటిక్స్ కమిషన్‌లో సాగూ సభ్యుడు.