Duleep Tophy 2023 : దులీప్ ట్రోఫీ ఫైనల్ విజేత విహారి టీమ్..

దులీప్‌ ట్రోఫీని సౌత్‌ జోన్‌ ఎగరేసుకెళ్లింది.

Update: 2023-07-16 12:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: దులీప్‌ ట్రోఫీని సౌత్‌ జోన్‌ ఎగరేసుకెళ్లింది. హోరా హోరీగా జరిగిన దులీప్‌ ట్రోఫీ ఫైనల్స్‌లో సౌత్‌ జోన్‌ ఘన విజయాన్ని సాధించింది. వెస్ట్‌జోన్‌పై 75 పరుగుల తేడాతో హనుమ​సేన సూపర్‌ విక్టరీ సాధించింది. 298 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్ట్‌ జోన్‌.. 222 పరుగులకే ఆలౌటైంది. ఆఖరి రోజు సౌత్ జోన్ బౌలర్లు విజృంభించడంతో 298 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్ట్ జోన్ 222 పరుగులకే ఆలౌటై ఓటమి చవి చూసింది. దీంతో హనుమ విహారి నాయకత్వంలోని సౌత్‌ జోన్‌ కప్‌ను ముద్దాడింది.

ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌, సిరీస్‌గా సౌత్‌ జోన్‌ ఆటగాడు విధ్వత్ కావేరప్ప నిలిచాడు. కెప్టెన్ ప్రియాంక్ పాంచల్‌ (95), సర్ఫరాజ్‌ ఖాన్ (48) పోరాడినప్పటికీ.. వెస్ట్ జోన్‌కు ఓటమి తప్పలేదు. అయితే సౌత్‌జోన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగులకే వెస్ట్‌ జోన్ ఆలౌట్‌ చేసింది. కానీ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలం కావడం వల్ల వెస్ట్‌జోన్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. సౌత్‌ జోన్ బౌలర్ కావేరప్ప ఏకంగా ఏడు వికెట్లు తీసి వెస్ట్‌ జోన్‌ను దెబ్బకొట్టాడు.


Similar News