'అతడికి టెస్టుల్లో అవకాశం ఇవ్వండి.. ఇంగ్లండ్‌ పేసర్‌‌తో పోల్చిన భారత మాజీ క్రికెటర్‌'

కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ గతేడాది జూన్‌లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.

Update: 2023-07-13 10:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ గతేడాది జూన్‌లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ యువ పేసర్‌.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అద్భుత ప్రదర్శనతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయినప్పటికీ వెస్టిండీస్‌ టీ20 సిరీస్‌ నేపథ్యంలో ఉమ్రాన్‌ మాలిక్‌కు చోటు దక్కడం విశేషం. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాణిస్తున్న ఉమ్రాన్‌ను టెస్టు జట్టుకు ఎప్పుడు ఎంపిక చేస్తారని సెలక్టర్లను ప్రశ్నించాడు. ఉమ్రాన్‌ను ఇంగ్లండ్‌ పేసర్‌ మార్క్‌వుడ్‌తో పోల్చిన మంజ్రేకర్‌.. టెస్టుల్లో అతడికి అవకాశం ఇస్తే చెలరేగిపోతాడని అభిప్రాయపడ్డాడు.

''టెస్టు క్రికెట్‌ జట్టుకు ఉమ్రాన్‌ను తప్పకుండా ఎంపిక చేయాలి. మార్క్‌వుడ్‌ గంటకు 90 మైళ్లకు పైగా వేగంతో బౌలింగ్‌ చేయగల సమర్థుడు. టెయిలెండర్లను ఎక్కువ సేపు క్రీజులో నిలవనివ్వడు. అదే అతడి స్పెషాలిటీ. ఉమ్రాన్‌ మాలిక్‌ విషయంలో పునరాలోచన చేయాలి. మార్క్‌వుడ్‌ మాదిరే వేగంతో బౌలింగ్‌ చేయగలడు'' అని సంజయ్‌ మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు.


Similar News