ఒక్క ఇన్సింగ్స్‌తో.. అందరి నోర్లు మూయించిన ‘రోహిత్’

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.

Update: 2024-06-26 18:49 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. టీ20 ప్రపంచ కప్‌లో హిట్‌మ్యాన్ జట్టును సరైన పథంలో ముందుకు నడిపించడమే కాకుండా కీలక సమయాల్లో తన బ్యాటుతో విధ్వంసాలు సైతం సృష్టిస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో భాగంగా ఆస్ట్రేలియాలో జరిగిన చివరి మ్యాచులో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన కోహ్లీ(0) డకౌట్ కాగా, రోహిత్ మాత్రం ఆసీస్ బౌలర్లపై విరుచుకపడ్డారు. కేవలం 41 బంతుల్లోనే 92 పరుగులు రాబట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ క్రమంలోనే రోహిత్ అద్బుత ఇన్నింగ్స్‌‌పై ఆసీస్ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌‌క్రిస్ట్ పొగడ్తల వర్షం కురిపించారు. తన ఆటతీరుతో విమర్శకుల అందరి నోర్లు మూయించారని చెప్పారు. ‘రోహిత్ చాలా అద్భుతంగా ఆడాడు. దూకుడు కొనసాగిస్తామని బయట చెప్పిన మాటలను మైదానంలో చేసి చూపించాడు. యువక్రికెటర్లకు ఎంతో స్ఫూర్తిగా నిలిచాడు. అతని ఐపీఎల్ గణాంకాలను చూసి చాలా మంది విమర్శలు చేయగా..వాటన్నింటికీ రోహిత్ సమాధానం ఇచ్చాడు. జట్టులో తన విలువేంటో చాటిచెప్పాడు. మ్యాచ్ సందర్భంగా చాలా మంది కెప్టెన్లు ఫలితాల గురించి ఆలోచించడం.. ఆడే విధానంపై దృష్టి పెడతాం’ అంటుంటారు. కానీ,ఇక్కడ రోహిత్ మాత్రం దూకుడు గానే తన ఇన్నింగ్స్ ఉంటుందని చెప్పకనే చెప్పాడు’ అని గిల్‌క్రిస్ట్ చెప్పుకొచ్చారు.

Similar News