జింబాబ్వేపై సస్పెన్షన్ ఎత్తివేత.. ‘ఫిఫా’ ప్రకటన

జింబాబ్వే ఫుట్‌బాల్ అసోసియేషన్(ZIFA)పై విధించిన సస్పెన్షన్‌ను ఫిఫా తాజాగా ఎత్తివేసింది.

Update: 2023-07-11 15:24 GMT

హరారే: జింబాబ్వే ఫుట్‌బాల్ అసోసియేషన్(ZIFA)పై విధించిన సస్పెన్షన్‌ను ఫిఫా తాజాగా ఎత్తివేసింది. జింబాబ్వే ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యాన్ని గుర్తించిన ఫిఫా.. గతేడాది ఫిబ్రవరిలో ఆ జట్టుపై 18 నెలల సస్పెన్షన్ విధించింది. ఈ సస్పెన్షన్ కాలం దాదాపు పూర్తయిన నేపథ్యంలో దానిని ఎత్తివేస్తున్నట్టు ఫిఫా అధికారులు స్పష్టం చేశారు.

2026 వరల్డ్ కప్ కోసం ఆఫ్రికన్ క్వాలిఫయర్ పోటీల డ్రా మరికొద్ది రోజుల్లో జరగనుండగా ఫిఫా తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాగా, తదుపరి ప్రపంచ కప్ కోసం ఆఫ్రికన్ క్వాలిఫయర్స్ డ్రా సీఏఎఫ్(ఆఫ్రికన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్) కాంగ్రెస్‌లో గురువారం జరగనుంది. తొలి రౌండ్ మ్యాచ్‌లు నవంబర్‌లో నిర్వహించనున్నారు.


Similar News