అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించనున్న ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్..

Update: 2023-09-21 12:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌.. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న కౌంటీ సీజన్‌ (2023) ముగిసిన అనంతరం తన నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు (161 టెస్ట్‌ల్లో 45.4 సగటున 33 సెంచరీలు, 57 అర్ధసెంచరీల సాయంతో 12472 పరుగులు) చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన కుక్‌.. 2018లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ.. ఆ తర్వాత కౌంటీల్లో ఆడుతున్నాడు.

కుక్‌ తన కౌంటీ జట్టైన ఎసెక్స్‌ తరఫున ప్రస్తుతం జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 23 ఇన్నింగ్స్‌లు ఆడిన కుక్‌.. 36.72 సగటుతో 3 అర్ధశతకాల సాయంతో 808 పరుగులు చేశాడు. అలిస్టర్‌ కుక్‌ ఇంగ్లండ్‌ తరఫున టెస్ట్‌ల్లో టాప్‌ స్కోరర్‌గా నిలువడమే కాకుండా టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో, టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్‌గా పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు.


Similar News