పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన ఇంగ్లాడ్.. 832 పరుగులతో వరల్డ్ రికార్డ్ బ్రేక్

పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ దేశంలోని ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది.

Update: 2024-10-10 09:26 GMT

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ దేశంలోని ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. కాగా ఈ మ్యాచులో పాకిస్తాన్ జట్టుకు ఇంగ్లాండ్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. మొదటి ఇన్నింగ్స్ లో 556 పరుగుల భారీ స్కోర్ చేసిన పాక్.. ఇంగ్లాండ్ బ్యాటర్ల దెబ్బకు కుదేలైంది. ముఖ్యంగా జో రూట్, హారీ బ్రూక్ లు పాకిస్తాన్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఇద్దరు ప్లేయర్లు నాలుగో వికెట్ కు ఏకంగా 454 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి.. చరిత్ర సృష్టించారు. అలాగే ఈ మ్యాచుల్లో జో రూట్ 374 బంతులు ఎదుర్కొని 17 ఫోర్లతో 262 పరుగులు చేసి అవుట్ కాగా.. హారీ బ్రూక్ 322 బంతులు ఎదుర్కొని 3 సిక్సర్లు 29 ఫోర్లతో ఏకంగా 317 పరుగులు చేసి రికార్డు సృష్టించారు. అలాగే క్రావ్లే 78, డక్కెట్ 84, స్మిత్ 31 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ జట్టు నాలుగో రోజు ఆటలో 150 ఓవర్లకు ఏకంగా 823-7 వద్ద డిక్లేర్ ఇచ్చింది.


Similar News