WWE రెజ్లింగ్ లెజెండ్.. రే మిస్టీరియో కన్నుమూత

WWE రెజ్లింగ్ లెజెండ్ రే మిస్టీరియో( Rey Mysterio) డిసెంబర్ 20 కన్నుమూశారు. ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు.

Update: 2024-12-21 12:56 GMT

దిశ, వెబ్ డెస్క్: WWE రెజ్లింగ్ లెజెండ్ రే మిస్టీరియో( Rey Mysterio) డిసెంబర్ 20 కన్నుమూశారు. ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. రే మిస్టీరియో సీనియర్ WWE సూపర్ స్టార్ డొమినిక్ మిస్టీరియోకి గ్రాండ్ మేనమామ, అతని అసలు పేరు మిగ్యుల్ ఏంజెల్ లోపెజ్ డయాస్. రే మిస్టీరియో సీనియర్ వరల్డ్ రెజ్లింగ్ అసోసియేషన్‌తో సహా పలు రెజ్లింగ్ ఈవెంట్లలో పాల్గొన్నాడు. రే మిస్టీరియో సీనియర్ 1976లో WWE లోకి అరంగేట్రం చేశాడు. ప్రో రెజ్లింగ్ రివల్యూషన్, టిజువానా రెజ్లింగ్, వరల్డ్ రెజ్లింగ్ అసోసియేషన్ వంటి ప్రధాన రెజ్లింగ్ బ్రాండ్‌లలో ఆయన రెజ్లింగ్ చేశాడు. కాగా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 20 మృతి చెందినట్లు తెలిపారు. కాగా ఆయన మృతిపై WWE మొత్తం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.


Similar News