జనవరి 12న బీసీసీఐ సెక్రెటరీ ఎన్నిక!

వచ్చే ఏడాది జనవరి 12న బీసీసీఐ స్పెషల్ జనరల్ మీటింగ్ నిర్వహించనుంది.

Update: 2024-12-21 13:24 GMT

దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఏడాది జనవరి 12న బీసీసీఐ స్పెషల్ జనరల్ మీటింగ్ నిర్వహించనుంది. ఆ సమావేశంలో కొత్త సెక్రెటరీని ఎన్నుకోనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే, నూతన కోశాధికారి పదవికి కూడా ఎన్నిక జరగనుంది. బీసీసీఐ సెక్రెటరీగా ఉన్న జై షా ఈ నెల 1 నుంచి ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆ పదవి ఖాళీ అయిన నేపథ్యంలో దేవజిత్ సైకియాను బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ తాత్కాలిక సెక్రెటరీగా నియమించారు. శాశ్వత సెక్రెటరీ ఎన్నిక వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. మరోవైపు,కోశాధికారి ఆశిష్ షెలార్ ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. జనవరి 12న జరిగే మీటింగ్‌లో సెక్రెటరీ, కోశాధికారి పోస్టులను భర్తీ చేయనున్నారు.

Tags:    

Similar News