టీమిండియా పేలవ ప్రదర్శనపై జడేజా కీలక వ్యాఖ్యలు

ఆస్ట్రేలియా పరిస్థితుల్లో టాపార్డర్ బ్యాటర్లు చేసే పరుగులే చాలా కీలకమని టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వ్యాఖ్యానించాడు.

Update: 2024-12-21 19:04 GMT

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా పరిస్థితుల్లో టాపార్డర్ బ్యాటర్లు చేసే పరుగులే చాలా కీలకమని టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వ్యాఖ్యానించాడు. నాలుగో టెస్టుకు ముందు శనివారం ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో జడేజా మాట్లాడుతూ.. భారత బ్యాటర్ల పేలవ ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఓవర్‌సీస్ కండిషన్స్‌లో ఆడుతున్నప్పుడు టాపార్డర్ చేసే పరుగులు చాలా కీలకమైనవి. టాపార్డర్ విఫలమైనప్పుడు లోయర్ ఆర్డర్‌పై బాధ్యత, ఒత్తిడి పెరుగుతుంది. నాలుగో టెస్ట్‌లో టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు రాణిస్తారని ఆశిస్తున్నాం. గత మ్యాచ్‌లో మా ఆట తీరు పేలవంగా ఉంది. ఆ తప్పిదాలను సరిచేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మా ఫోకస్ అంతా నాలుగో టెస్టుపైనే ఉంది.’ అని చెప్పాడు. అలాగే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుని ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ కొడతామని దీమా వ్యక్తం చేశాడు. ‘ సిరీస్‌లో 1-1తో మంచి స్థితిలోనే ఉన్నాం. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా సిరీస్ మా సొంతమవుతుంది. గతంలో రెండు సార్లు మేమే గెలిచాం. సిరీస్‌లో పైచేయి సాధించడానికి మెల్‌బోర్న్ టెస్టు మాకు మంచి అవకాశం.’ అని తెలిపాడు. అశ్విన్ రిటైర్మెంట్‌పై స్పందిస్తూ.. అశ్విన్ రోజంతా తనతో ఉన్నా రిటైర్మెంట్ గురించి హింట్ ఇవ్వలేదన్నాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌కు ఐదు నిమిషాల ముందే తనకు విషయం తెలిసిందన్నాడు. 

Tags:    

Similar News