U19 Women's T20 Asia Cup: మహిళల అండర్-19 ఆసియా కప్‌లో సంచలనం.. ఛాంపియన్‌గా నిలిచిన భారత్
అండర్-19 ఆసియా మహిళల టీ20 (U19 Women's T20 Asia Cup) ఛాంపియన్‌గా భారత్ (India) విజేతగా నిలిచింది.
దిశ, వెబ్‌డెస్క్: అండర్-19 ఆసియా మహిళల టీ20 (U19 Women's T20 Asia Cup) ఛాంపియన్‌గా భారత్ (India) విజేతగా నిలిచింది. ఫైనల్‌లో బంగ్లాదేశ్ (Bangladesh)పై టీమిండియా (Team India) 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బంగ్లాదేశ్ (Bangladesh) బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత (India) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 117 పరుగలు చేసింది. జట్టులో గొంగాడి త్రిష (Gongadi Thrisha) 47 బంతుల్లో 52 పరుగులు చేసింది. అనంతరం 118 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ (Bangladesh) కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయింది. భారత (India) బౌలర్లలో ఆయుషి శుక్లా (Ayushi Shukla) 3, సోనమ్ యాదవ్ (Sonam Yadav), పరుణిక సోసోడియా (Parunika Sisodia) 2 వికెట్లు, జోషిత ఇక వికెట్ పడగొట్టి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.