Boxing Day Test : బాక్సింగ్ టెస్టుకు ముందు.,టీమిండియాకు గాయాల టెన్షన్

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ(Border-Gavaskar Trophy)సిరీస్‌లో ఆస్ట్రేలియా(Australia)తో గురువారం నుంచి ప్రారంభంకానున్న బాక్సింగ్‌ డే టెస్టు(Boxing Day Test)కు ముందు టీమిండియా(India)ను గాయాల(Injury)టెన్షన్ భయపెడుతోంది.

Update: 2024-12-22 07:37 GMT

దిశ, వెబ్ డెస్క్ : బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ(Border-Gavaskar Trophy)సిరీస్‌లో ఆస్ట్రేలియా(Australia)తో గురువారం నుంచి ప్రారంభంకానున్న బాక్సింగ్‌ డే టెస్టు(Boxing Day Test)కు ముందు టీమిండియా(India)ను గాయాల(Injury)టెన్షన్ భయపెడుతోంది. ఈ సిరీస్‌లో సూపర్‌ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(KL Rahul)శనివారం నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో కుడిచేతికి బంతి తగిలి గాయపడ్డాడు.  అయితే రాహుల్‌ గాయం అంత తీవ్రమైనది కానట్లు తెలుస్తున్నది. ఇకపోతే తాజాగా మెల్‌బోర్న్‌లో బాక్సింగ్ టెస్టు సన్నాహాల్లో ఉన్న టీమిండియా ప్రాక్టిస్‌ సందర్భంగా హిట్‌మ్యాన్‌ కెప్టెన్ రోహిత్‌ శర్మ (Rohit Sharma) కూడా గాయపడ్డాడు. 

త్రోడౌన్‌ స్పెషలిస్ట్‌ దయాను ఎదుర్కొనే క్రమంలో రోహిత్‌ ఎడమ మోకాలికి బంతి తాకడంతో అతను నొప్పితో విలవిలలాడాడు. వెంటనే రోహిత్ మెకాలికి ఫిజియో ఐస్‌ ప్యాక్‌ను తెచ్చి చికిత్స చేశారు. రోహిత్ గాయానికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే రోహిత్‌ గాయంపై బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. రోహిత్‌, రాహుల్ లలో ఎవరు బాక్సింగ్‌ డే టెస్ట్‌కు దూరమైనా వారి స్థానంలో సర్ఫరాజ్‌ ఖాన్‌, ధ్రువ్‌ జురెల్‌, అభిమన్యు ఈశ్వరన్ లలో ఒకరిని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

ఐదు మ్యాచ్‌ల బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఈ నేపథ్యంలో నాల్గవ టెస్టు రెండు జట్లకు కీలకంగా మారింది. సిరీస్ కైవసం దిశగా ఆధిక్యత సాధించాలంటే రెండు జట్లు ఈ మ్యాచ్ గెలిచేందుకు గట్టిగా పోరాడనున్నాయి.

Tags:    

Similar News