ఢిల్లీలో సిక్సర్ల మోత.. భారత్ భారీ స్కోర్

బంగ్లాదేశ్ ఇండియా టూర్ లో భాగంగా మూడు టీ20ల సిరీస్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు రెండో టీ20 ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరుగుతొంది.

Update: 2024-10-09 15:42 GMT

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ ఇండియా టూర్ లో భాగంగా మూడు టీ20ల సిరీస్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు రెండో టీ20 ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరుగుతొంది. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత మొదట బ్యాటింగ్ చేయగా.. ఓపెనర్లు సంజూ, అభిషేక్ లు వెంట వెంటనే అవుట్ కావడం, కెప్టెన్ సూర్య కూడా తక్కువ పరుగలకు అవుట్ కావడంతో పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో బ్యాటింగ్ వచ్చిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి, రింకూ సింగ్ లు.. బంగ్లా బౌలర్లపై విరుచుకు పడ్డారు. నితీష్ అయితే 34 బంతుల్లో 7 సిక్సర్లు 4 ఫోర్లతో 74 పరుగులు చేశాడు. అనంతరం రింకు సింగ్, హర్దిక్ పాండ్యాలు సైతం బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. రింకు 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ సెంచరీ చేసుకున్నాడు. అలాగే హార్దిక్ పాండ్యా రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 32 పరుగులు చేశాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. కాగా ఈ మ్యాచులో భారత్ ప్లేయర్లు ఏకంగా 14 సిక్సర్లు 17 ఫోర్లతో బౌండరీల వర్షం కురిపించారు. కాగా ఈ మ్యాచులో బంగ్లాదేశ్ విజయం సాధించాలంటే నిర్ణీత 120 బంతుల్లో 222 పరుగులు చేయాల్సి ఉంది.


Similar News