రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ క్రీడాకారుడు

టెన్సిస్ దిగ్గజం రఫెల్ నాదల్(Rafael Nadal) అందరినీ షాక్‌కు గురి చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. రిటైర్మెంట్(Retirement) ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

Update: 2024-10-10 10:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: టెన్సిస్ దిగ్గజం రఫెల్ నాదల్(Rafael Nadal) అందరినీ షాక్‌కు గురి చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. రిటైర్మెంట్(Retirement) ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. మొత్తం 13 భాషల్లో ఇన్నాళ్లు తనను ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు. కెరీర్‌లో చివరగా నాదల్ డేవిస్ కప్ ఆడిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటివరకు నాదల్.. 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుపొందారు. స్పెయిన్ బుల్‌గా పేరొందిన నాద‌ల్ టెన్నిస్ దిగ్గజ ఆట‌గాళ్లలో ఒక‌డు. రోజ‌ర్ ఫెద‌ర‌ర్, ఆండీ రాడిక్, లీట‌న్ హెవిట్.. వంటి దిగ్గ‌జాలు టెన్నిస్‌ను ఏలుతున్న రోజుల్లో నాద‌ల్ అరంగేట్రం చేసి సత్తా చూపించాడు. అద్భుత విజ‌యాల‌తో అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్స్ గెలిచాడు.


అయితే.. గాయాలు వెంటాడ‌డంతో కొన్నిరోజుల పాటు టెన్నిస్‌కు దూరంగా ఉండి రెస్ట్ తీసుకున్నారు. ఆ గాయాలు ఎంతకీ మానకపోవడంతో ఇక ఆటడం కష్టమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ కాలం వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 1గా నాదల్ కొన‌సాగిన విషయమూ తెలిసిందే. ‘‘అందరికీ కృతజ్ఞతలు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడటం ఇదే చివరిసారా అనే ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. గాయాల వల్ల నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. మళ్లీ నేను ఫ్రెంచ్ ఓపెన్ ఆడలేను అనిపిస్తుంది. ఒలింపిక్స్‌ మాత్రం తప్పకుండా ఆడేందుకు ప్రయత్నిస్తా’’ అంటూ నాదల్‌ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

Tags:    

Similar News