అప్పుడు దాని గురించి అస్సలు ఆలోచించలేదు : ఆకాశ్ దీప్

భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు డ్రా అయిన విషయం తెలిసిందే.

Update: 2024-12-22 13:27 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు డ్రా అయిన విషయం తెలిసిందే. డ్రా అవడానికి ముందు టెయిలెండర్లు బుమ్రా, ఆకాశ్ దీప్ భారత్‌ను ఫాలో ఆన్ గండం నుంచి తప్పించారు. దీనిపై తాజాగా ఆకాశ్ దీప్ స్పందించాడు. ఆదివారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తాను బ్యాటింగ్‌కు వచ్చే సమయంలో ఫాలో ఆన్ గురించి ఆలోచించలేదన్నాడు. కేవలం నాటౌట్‌గా ఉండాలనే ఆడాలని చెప్పాడు. ‘మేం లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగాం. మేము జోడించే 25-30 పరుగులైనా చాలా విలువైనవి. నా మైండ్‌లో అదే ఉంది. ఆ రోజు నాకు ఫాలో ఆన్ ఆలోచన లేదు. నాటౌట్‌గా ఉండాలనే అనుకున్నా. దేవుడి దయ వల్ల ఫాలో ఆన్ నుంచి బయటపడ్డాం. ఆ పరిస్థితుల నుంచి కాపాడుకోవడంతో జట్టులో కూడా జోష్ వచ్చింది.’అని ఆకాశ్ తెలిపాడు. తొలిసారి ఆసిస్ పర్యటనలో తనకు సీనియర్లు రోహిత్, కోహ్లీ, బుమ్రా సహాయపడ్డారని చెప్పాడు. ‘బుమ్రా ఇచ్చిన సలహాలు నాకు చాలా ఉపయోగపడ్డాయి. ఆసిస్ గడ్డపై మేము తొలిసారిగా ఆడుతున్నప్పటికీ అలా కనిపించకపోవడానికి కారణం రోహిత్, కోహ్లీలే. వారు నిరంతరం బౌలర్లకు ఫీడ్‌బ్యాక్ ఇచ్చేవారు.’ అని చెప్పుకొచ్చాడు.

 

Tags:    

Similar News